
విధులు సక్రమంగా నిర్వర్తించాలి
సాక్షి,యాదాద్రి : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్స్, సెక్టార్ ఆఫీసర్, ఎలక్షన్ సిబ్బంది అందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయడం లేదని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండల ప్రత్యేక అధికారుల నియామకం
రాజాపేట : గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులను మారుస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భువనగిరి మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జీనుగుల శ్యాంసుందర్, గూండాల మండల ప్రత్యేక అధికారిగా ఆలేరు ఏడీఏ పద్మావతి, పోచంపల్లి మండల ప్రత్యేక అధికారిగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి సీ.రమణి, రాజాపేట మండల ప్రత్యేక అధికారిగా యాదగిరిగుట్ట ఏడీఏ వీ.శాంతి నిర్మలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment