
సాగు వివరాలు.. ఆన్‌లైన్‌లో
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
ఫ ఒక్కో ఏఈఓకు 1,800నుంచి 2వేల ఎకరాలు టార్గెట్
ఫ పంటలు చేతికొచ్చే నాటికి పూర్తి చేయాలని ఆదేశం
ఫ 30,125 ఎకరాల్లో సర్వే పూర్తి
వరి 2,75,316
ఆయిల్‌పామ్ 1,826
రామన్నపేట : జిల్లాలో యాసంగి పంటల ఆన్‌లైన్ నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పంటలు చేతికొచ్చేలోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది.
ఒక్కో ఏఈఓకు 1,800 నుంచి
రెండు వేల ఎకరాలు..
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 2,78,136 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 2,75,316 ఎకరాలు, ఆయిల్‌పామ్ 1,826 ఎకరాలు, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేశారు. జిల్లాను 92 వ్యవసాయ క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక ఏఈఓను నియమించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో సాగైన పంటల్లో 1800 నుంచి రెండు వేల ఎకరాలను డిజిటల్ సర్వే చేసి వాటి వివరాలను సర్వే నంబర్ల వారీగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మిగిలిన పంటల వివరాలను సాధారణంగా(ఆఫ్‌లైన్) నమోదు చేయాలి.
ఫొటో తీసి.. యాప్‌లో అప్‌లోడ్
ఏఈఓ నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్‌లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడినుంచే యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్‌లోడ్ చేయడం కుదరదు. సర్వే చేసే పొలానికి సంబంధించిన సర్వే నంబర్‌కు 25 మీటర్ల పరిధి వరకే యాప్ పనిచేస్తుంది. ఫిభ్రవరి 5వ తేదీన సర్వే ప్రారంభమైంది. ప్రారంభంలో యాప్ సరిగా పనిచేయకపోవడం, సర్వర్ బిజీ, నెట్‌వర్క్ సమస్యలతో సర్వే మందకొడిగా సాగింది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో మూడు, నాలుగు రోజుల నుంచి సర్వే ఊపందుకుంది. జిల్లాలో మొత్తం 1,84,000 ఎకరాలను డిజిటల్ సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 30,125 ఎకరాల్లో పూర్తిచేసి యాప్‌లో నమోదు చేశారు.
ఇతర
పంటలు994
మొత్తం2,78,136
పంటల సాగు (ఎకరాల్లో)
సర్వే చేయాల్సిన పంటలు
మొత్తం 1,84,000 పూర్తయినవి 30,125
ప్రయోజనాలు అనేకం
డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహద పడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానా కాలంలో డిజిటల్ క్రాప్ చేయించుకోకపోవడం వల్ల పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రైతులు సహకరించాలి
జిల్లా వ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఉన్నతాథికారులు సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం నిరాటంగా సర్వే జరుగుతుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు చాలా ఉపయోగ పడుతుంది. పంటలను అమ్ముకోవడానికి, పంటల భీమా, నష్టపరిహారం పొందడానికి ఉపకరిస్తుంది. సర్వేకోసం వస్తున్న విస్తరణాధికారులకు రైతులు సహకరించాలి.
–గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి

సాగు వివరాలు.. ఆన్‌లైన్‌లో

సాగు వివరాలు.. ఆన్‌లైన్‌లో
Comments
Please login to add a commentAdd a comment