
బర్డ్‌ఫ్లూపై అలర్ట్
లక్షణాలు
● కోడి తల ఉబ్బి ఉంటుంది.
● ముక్కునుంచి ద్రవం కారుతుంది.
● వందల సంఖ్యలో కోళ్లు చనిపోతాయి.
ఇలా చేయాలి
● చనిపోయిన కోళ్లను ఖననం చేయాలి. లేదా లోతైన గోయ్యి తీసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లి పూడ్చిపెటాలి.
సాక్షి, యాదాద్రి : బర్డ్ ఫ్లూపై పశు సంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. పెద్ద ఎత్తున కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లఫారాల్లో తనిఖీలు చేస్తూ వ్యాధి నివారణపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు.
యజమానుల్లో ఆందోళన
జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ పౌల్ట్రీ యజమానుల్లో ఆందోళన నెలకొంది. కొందరు నేరుగా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించి వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి తెలుసుకుంటున్నారు. జిల్లాలో భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట తదితర మండలాల్లో పెద్ద ఎత్తున పౌల్టీ పరిశ్రమ విస్తరించి ఉంది. సుమారు 300 ఫారాలు ఉండగా 45 లక్షల వరకు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో సుమారు 15 లక్షల కోళ్లు లేయర్, 3 లక్షల వరకు పేరెంట్ స్టాక్, మిగతావి బ్రాయిలర్ కోళ్లు ఉన్నాయి.
తక్కువ ధరకు అమ్మకం : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో బర్డ్ ప్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన పౌల్ట్రీ యజమానులు ముందుగానే తేరుకుని కోళ్లను ఎంతోకొంత రేటుకు అమ్ముతున్నారు.
చెక్‌పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడి నుంచి బ్రాయిలర్, నాటు కోళ్లు ఉమ్మడి నల్ల గొండ జిల్లాకు రవాణా చేయకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుంటూరు– నల్లగొండ జిల్లా సరి హద్దులోని వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చౌరస్తా వద్ద పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
సంప్రదించాల్సిన నంబర్ 99899 97697
ఫ ఏపీలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు
ఫ అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ
ఫ పౌల్ట్రీ ఫాంలలో తనిఖీలు
ఫ పరీక్షల నిమిత్తం కోళ్ల నుంచి
రక్త నమూనాల సేకరణ
ఫ ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు అవగాహన
సందేహాలుంటే సమాచారం ఇవ్వండి
జిల్లాలో బర్డ్ ప్లూ కేసులు బయట పడలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలకు వెళ్లి కోళ్లను పరిశీలిస్తున్నాం. వ్యాధి లక్షణాలు, గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఫారాల్లో పరిశుభ్రత తప్పనిసరి. యాంటిబయాటిక్ మందులు వేయాలి. చికెన్ విషయంలో ఆందోళన చెందవద్దు. 100 డిగ్రీల సెల్సీయస్‌లో ఉడికించి తినవచ్చు.
–డాక్టర్ కృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు
జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానప్పటికీ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్ల ఫారాలను తనిఖీ చేసి వ్యాధి లక్షణాలకు గుర్తించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశారు. ఈ టీఎంలు ప్రతీ ఫాంకు వెళ్లి కోళ్లకు పరీక్షలు చేస్తున్నారు. అనుమానం ఉంటే శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.

బర్డ్‌ఫ్లూపై అలర్ట్

బర్డ్‌ఫ్లూపై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment