
ఉపసంహరణకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు.
రైస్ మిల్లులో తనిఖీలు
రామన్నపేట : మండలంలోని ఇంద్రపాలనగరం విద్య ఆగ్రో రైస్‌మిల్లులో సివిల్ సప్లై అధికారులు చేపట్టిన తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. రికార్డులు పరిశీలించి ధాన్యం స్టాక్‌ను లెక్కించారు. ప్రభుత్వానికి చెల్లింపులపై ఆరా తీశారు. తనిఖీల్లో జిల్లా సివిల్‌సప్లయ్ అధికారి వనజాత, ఏఎస్‌ఓ రోజారాణి, డీఎం హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ బాలమణి పాల్గొన్నారు.
డ్రెయినేజీ చుట్టూ రేకులు ఏర్పాటు
చౌటుప్పల్ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట సర్వీస్ రోడ్డులో ఉన్న డ్రెయినేజీ చుట్టూ రేకులు ఏర్పాటు చేశారు.అండర్‌పాస్ నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్డులో చేపట్టిన డ్రెయినేజీ పనులు మార్కెట్ కార్యాలయం ఎదుట రెండు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు డ్రెయినేజీలో పడిపోతున్నాయి. నీ నేపథ్యంలో సాక్షిలో ప్రచురించిన కథనాలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు డ్రెయినేజీ గుంత చుట్టూ కాంట్రాక్టర్ రేకులు ఏర్పాటు చేశారు.
పెద్దగట్టు జాతరకు
పటిష్ట భద్రత
చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన పెద్దగట్టు పరిసరాలను కలియదిరిగి బందోబస్త్ ఏర్పాట్లు, జాతర రూట్ మ్యాప్, గ్లోబల్ మ్యాప్‌లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బందికి వసతి, జాతరకు వచ్చి పోయే మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తామన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లిస్తామని పేర్కొన్నారు. నిఘా కోసం 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు జరగకుండా స్పెషల్ టీమ్స్, క్రైం కంట్రోల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక టీమ్ మఫ్టీలో తిప్పుతూ అనుమానితులను గుర్తించి, దొంగతనాలు జరగకుండా చూస్తామన్నారు. మహిళల భద్రతకు షీటీం పని చేయనుందన్నారు. చెరువు నిండుగా ఉన్నందున చెరువు వైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
నారసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం విశేషంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరి చిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపం, ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు.

ఉపసంహరణకు నేడు ఆఖరు

ఉపసంహరణకు నేడు ఆఖరు
Comments
Please login to add a commentAdd a comment