
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం
భూదాన్‌పోచంపల్లి : బీఆర్‌ఎస్ సర్కార్ పదేళ్లలో ప్రజలకు ఏమీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో అధికారం కట్టబెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నమ్మకం నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుముకుల గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. రసాయన కంపెనీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, సాగు, తాగునీరు ఎద్దడి ఉందని అంతమ్మగూడెం, దోతిగూడెం ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పిలాయిపల్లి కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో ఫోన్ మాట్లాడి మిషన్‌భగీరథ ద్వారా 16 గ్రామాలకు కృష్ణానీళ్లు సరిపడా సరఫరా చేయాలని ఆదేశించారు.
ఏడాదిలో ఎంతో చేశాం
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎంతో చేశామని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని, రైతుభరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాల అమలుతో పాటు కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలకు రూ.500 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హెచ్‌ఎండీఏ నిధులు రూ.52కోట్లతో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.32 రూట్లలో కొత్తగా ఆర్టీసీ బస్సులు వేయించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలను కై వసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాక మల్లేశ్, జిల్లా నాయకుడు తడక వెంకటేశం, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మర్రి నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాలయ్య, గునిగంటి రమేశ్, తోట శ్రీనివాస్, అనిరెడ్డి జగన్‌రెడ్డి, కాసుల అంజయ్య, మన్నెం వెంకట్‌రెడ్డి, ఏర్పుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాలెం మల్లేశ్, పాక జంగయ్య, రావుల లింగస్వామి, బండ మురళీ, ముద్దం శేఖర్, వల్లూరి కుమార్, సుధాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, కంటె లింగస్వామి, మర్రి రాజిరెడ్డి, మేకల కృష్ణ, పాక రమేశ్, చుక్క వెంకటేశం, కోట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment