
సేవలపై ఆరా తీసి.. సూచనలు చేసి..
బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఒడిశా ప్రతినిధులు, చిత్రంలో స్థానిక వైద్యులు
భువనగిరి, ఆలేరు రూరల్ : భువనగిరి మండలం బొల్లేపల్లి పీహెచ్‌సీ, ఆలేరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను బుధవారం ఒడిశా నేషనల్ హెల్త్ మేనేజ్‌మెంట్ బృందం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ తెలంగాణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జానకిరాం, డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో సందర్శించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద అందజేస్తున్న సేవలు, గర్భిణుల సంరక్షణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, డయాలసిస్ కేంద్రంలో బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఆహారం అందజేస్తున్నారని, ప్రసవాలపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment