ఎమ్మెల్సీ బరిలో 19 మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 19 అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 19 మంది మధ్య పోటీ కొనసాగనుంది. బరిలో ఉండే వారు తేలడంతో శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది.
మొత్తం 23 నామినేషన్లు దాఖలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 3వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 10 తేదీన ముగి సింది. మొత్తం 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 11వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఒక అభ్యర్థి ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది నామినేషన్లను ఆమోదించారు. 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు కావడంతో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారిలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన బండారు నాగరాజు, కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన జి.కోటిరెడ్డి ఉన్నారు.
మిగిలింది ప్రచారమే..
ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలిపోయింది. అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక నేటి నుంచి ప్రచారం ముమ్మరం కానుంది. పోలింగ్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. కాగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రచారం బంద్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. సాధారణ ఎన్నికల తరహాలో ఎక్కడికక్కడ కళాశాలలు, సంఘాల వారీగా దావత్‌లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామంటూ ఉపాధ్యాయులకు హామీలు గుప్పిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.
పోటీలో ఉన్న అభ్యర్థులు
అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ఎస్. సుందర్‌రాజు, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వస్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబు రావు, బంక రాజు.
ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ
ఫ ఇక జోరుగా సాగనున్న ప్రచారం
ఫ టీచర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment