అశోక్‌గౌడ్‌కు బీజేపీ పగ్గాలు
సాక్షి, యాదాద్రి : బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఊట్కూరి అశోక్‌గౌడ్‌ను రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన అశోక్‌గౌడ్ స్వగ్రామం రాజాపేట. 34 సంవత్సరాలుగా పార్టీ విధేయునిగా ఉన్న అశోక్‌గౌడ్‌కు జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. రాజాపేటలో 1994లో ఏబీవీపీ నాయకునిగా పనిచేస్తూ అంచలంచెలుగా జిల్లా అధ్యక్షుని స్థాయికి ఎదిగారు. బీజేవైఎం, ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు బీజేపీలో జిల్లా ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బి.గోపాల్‌రెడ్డి, పట్నం రోజా, ఆలేరు నియోజకవర్గం నుంచి రచ్చ శ్రీనివాస్‌ను నియమించారు.
వీడిన ఉత్కంఠ
జిల్లా అధ్యక్ష పదవికోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఊట్కూరి అశోక్‌గౌడ్, పడాల శ్రీనివాస్, ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, చందామహేందర్‌గుప్తా, మాయ దశరథ, బాలకృష్ణ వంటి వారు పోటీపడ్డారు. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఊట్కూరి అశోక్‌గౌడ్, ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి పేర్లను రాష్ట్ర పార్టీకి పంపింది. పది రోజుల క్రితమే రాష్ట్రంలో పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. కానీ, ముగ్గురు పోటీ పడడం, పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భువనగిరి జిల్లా అధ్యక్షుని పేరు చివరి దశలో వాయిదాపడింది. తమకు అవకాశం కల్పించాలని ముగ్గురు ఆశావహులు ప్రయత్నాలు చేశారు. కానీ, చివరికి అశోక్‌గౌడ్‌ను ఫైనల్ చేసి ప్రకటించింది.
ఫ విధేయతకు పట్టం
ఫ చివరి వరకు పోటీ తీవ్రం
ఫ ఊట్కూరి అశోక్‌గౌడ్ వైపు
మొగ్గు చూపిన రాష్ట్ర పార్టీ
Comments
Please login to add a commentAdd a comment