
ఆశావహులెవరు?
కార్యకర్తలకు దిశానిర్దేశం
ఎన్నికలు ఎప్పుడు జరిగినా 80 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఇందుకోసం ఇప్పటినుంచే కేడర్‌ను సమాయత్తం చేయాలని చెప్పడంతో ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గత ఐదు రోజులుగా ముఖ్యులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహుల పేర్లను సేకరిస్తున్నారు. వడబోసి ఎన్నికల నాటికి గెలుపు గుర్రాల పేర్లు ప్రకటించనున్నారు.
సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల రేసులో ఉన్న ఆశావహుల పేర్లను తీసుకుంటున్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ మేరకు గెలుపుగుర్రాలను గుర్తించనున్నారు. పైరవీలకు తావులేకుండా అందరి ఏకాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆశావహులు ఫుల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ,
మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ టికెట్‌ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఒక్కో గ్రామం, వార్డు నుంచి ఐదారుగురు ఆశావహులు ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ గత రిజర్వేషన్లను బేరీజు చేసుకుని వారంతా ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో లేకున్నా పార్టీని వెన్నంటి ఉన్నవారు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి కేడర్, ప్రజాప్రతినిధులు భారీగా కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో చాలా మంది హామీలు పొంది వచ్చారు. పాత, కొత్త నేతల్లో భారీ సంఖ్యలో టికెట్ ఆశిస్తున్నారు.
పార్టీకి పని చేయనివారిపై ఫిర్యాదులు
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకోసం పనిచేయని వారు టికెట్‌లు ఆశిస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా ఎమ్మెల్యే ముందు ఉంచుతున్నారు. విధేయతను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యేలు
ఫ క్షేత్రస్థాయిలో కేడర్‌తో సమావేశాలు
ఫ అందరి అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment