
చికెన్ అమ్మకాలు డౌన్
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : భువనగిరిలోని బాబా చికెన్ సెంటర్ నిర్వాహకుడు ప్రతి ఆదివారం 800 కిలోల వరకు చికెన్ విక్రయించేవాడు. ఈ ఆదివారం 300 కిలోల లోపే విక్రయించాడు. పెళ్లిళ్ల కోసం నా లుగు ఆర్డర్లు రాగా అందులో రెండు క్యాన్సిల్ అయినట్లు యజమాని మహ్మద్ షూనుర్ తెలిపాడు..
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకుతుందన్న ప్రచారంతో చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. జిల్లావ్యాప్తంగా చికెన్ విక్రయాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలు దారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజూ నాలుగు నుంచి ఐదు వేల టన్నుల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో 10వేల టన్నుల వరకు ఉంటుంది. ఆదివారం అందులో సగం కూడా అమ్ముడుపోలేదు.
పడిపోతున్న ధరలు
చికెన్ అమ్మకాలతో పాటు ధర కూడా పడిపోతోంది. వారం రోజుల క్రితం కిలో చికెన్ (స్కిన్) రూ.200, స్కిన్‌లెస్ రూ.220 వరకు ఉండగా ప్రస్తుతం స్కిన్ రూ.190, స్కిన్‌లెస్ రూ.170 నుంచి రూ.180 వరకు అమ్ముతున్నారు.
ఉడకబెట్టి తింటే నో ప్రాబ్లమ్
ఉడికీ ఉడకని చికెన్ తినవద్దని, 70 నుంచి 100 డి గ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు. కోళ్ల ఫారాలు, చికెన్ సెంటర్లలో పని చేసే సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
50 శాతం తగ్గిన విక్రయాలు
ఫ బర్డ్ ఫ్లూ ప్రచారంతో కొనుగోలుకు జనం అనాసక్తి
ఫ మటన్, చేపలకు పెరిగిన డిమాండ్
మటన్ కిలో రూ.900
చికెన్‌కు బదులు మటన్, చేపల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కూడా పెరిగాయి. వారం కిందట మటన్ కిలో రూ.800 ఉండగా ఇప్పుడు రూ.900కు పెంచారు. చేపల రేట్లు సైతం కిలో రూ.20 నుంచి రూ.25 వరకు పెంచారు. ఐదారు రోజులుగా గిరాకీ పెరిగిందని చేపల వ్యాపారులు అంటున్నారు.

చికెన్ అమ్మకాలు డౌన్
Comments
Please login to add a commentAdd a comment