భువనగిరి : పదో తరగతి ఇంటర్నల్ మార్కులపై జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. మార్చి 21నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇంటర్నల్ మార్కుల నమోదు విషయంలో యాజమాన్యాలు అశాసీ్త్రయంగా చేయకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఈనెల 17నుంచి 18వ తేదీ వరకు పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నాయి. ఫార్మెటీవ్ పరీక్షల్లో వాస్తవంగా మార్కులు నమోదు చేశారా? ఇస్తారీతిన వేశారా? పరిశీలిస్తాయి.
టెన్త్ విద్యార్థులున్న పాఠశాలలు 266
జిల్లాలో పదో తరగతి విద్యార్థులున్న పాఠశాలలు 266 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ 178, రెసిడెన్సి యల్ 14, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు 74 ఉన్నాయి. వీటిలో 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. తనిఖీల కోసం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి 4 నుంచి 6 పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. బృందాల ఆమోదం పొందిన మార్కులను ఈ నెల 21 నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇవే చివరి ఇంటర్నల్
విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా 20 మార్కులు ఇంటర్నల్‌గా వేసే విధానం పదేళ్లుగా కోనసాగుతోంది. ఈ పద్ధతికి స్వప్తిపలుకుతున్నట్లు నవంబర్‌లో విద్యాశాఖ ప్రకటించింది. అప్పటికే ఇంటర్నల్ మార్కులు సిద్ధం చేసిన విషయానిన ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో ఈ విద్యా సంవత్సరం వరకు ఇంటర్నల్ విధానం కొనసాగిస్తున్నట్లు నిర్ణయించింది. దీంతో ఇవే చివరి ఇంటర్నల్ మార్కులు కానున్నాయి.
ఫ ఈనెల 17నుంచి 19వ తేదీ వరకు పాఠశాలల్లో తనిఖీలు
ఫ 21 బృందాలు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment