
కొలనుపాక వాగులో జారిపడిన దంపతులు
ఆలేరురూరల్ : ఆలేరు – కొలనుపాక వాగు కాజేవ్‌పై ఆదివారం దంపతులు జారిపడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య–అరుణ దంపతులు స్వగ్రామం నుంచి ఆలేరు పట్టణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. గోదావరి జలాలతో కొలనుపాక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు దాటే క్రమంలో జారిపడి కాజ్‌వే కిందకు కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు, స్థానికులు గమనించి వారిని కాపాడారు. ఈ ఘటనలో అరుణకు స్వల్పంగా, వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రైవేట్ అంబులెన్స్‌లో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
20 రోజుల్లో నాలుగు ఘటనలు
వాగు వద్ద 20 రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలోనే వర్షాకాలం సమయంలో పలువురు కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు. ఈ ప్రాంతంలో హైలెల్ బ్రిడ్జి నిర్మించాలని అనేకసార్లు ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఫ తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ఫ 20 రోజుల వ్యవధిలో నాలుగు ఘటనలు
Comments
Please login to add a commentAdd a comment