
తాగునీరు వస్తుందా..
ఫ భువనగిరి మున్సిపాలిటీలో పర్యటించిన కలెక్టర్ హనుమంతరావు
భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ హనుమాన్‌వాడలోని 7వ వార్డులో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయా, తాగునీరు వస్తుందా, రేషన్ బియ్యం ప్రతి నెలా ఇస్తున్నారా, గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. నర్సింహ అనే వ్యక్తిని గ్యాస్ సబ్సిడీ రావడం లేదని చెప్పగా.. వెంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారికి ఫోన్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక మహిళల అభ్యర్థన మేరకు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ కొండల్ రావు, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ రజిత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment