
స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం ప్రధానాలయంలోని ముఖ మండపంలో స్వస్తివాచనం, విశ్వక్సేనారాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముఖ మండపంతో పాటు గర్భాలయంలో, ఆలయ పరిసరాల్లో పుణ్యాహ వాచనం జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపం నుంచి యాగశాలకు ఊరేగింపుగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక సేవపై తీసుకువచ్చారు. అనంతరం పంచ కుండాత్మక యాగానికి అగ్ని ప్రతిష్ఠాపన చేసి హోమాధి పూజలు జరిపించారు. అదేవిధంగా రాత్రికి శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల, అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం చేసి, జలాధివాసం నిర్వహించారు.
ఫ యాదగిరి క్షేత్రంలో ప్రారంభమైన
మహా కుంభాభిషేక సంప్రోక్షణ
23న సీఎం రాక
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 23న రానున్నారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో బుధవారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ యాదగిరికొండ కింద హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.

స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన

స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన
Comments
Please login to add a commentAdd a comment