ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచాలి
బీబీనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నా యా, భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, వంటల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని సూచించారు. డిజిటల్ తరగతుల్లో తప్పనిసరిగా ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధించాలని, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ స్కూళ్లకు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment