● ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు యాదగిరి క్షేత్ర సన్నిధిలో ఒక గంట 53 నిమిషాలు గడిపారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరిన సీఎం దంపతులు ఉదయం 11.15 గంటలకు యాదగిరి కొండపై గల అతిథి గృహానికి చేరుకున్నారు.
● అతిథిగృహంలో సంప్రదాయ దుస్తులు ధరించి 11.20కి లిఫ్టు మార్గంలో ఉత్తర మాడ వీధిలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పంచకుండాత్మక యాగశాలోకి వెళ్లి కుంభాభిషేకానికి ఉపయోగించే జలాలకు పూజలు నిర్వహించారు.
● 11.28కి యాగశాల నుంచి ఉత్తర ద్వారం దక్షిణ తిరు వీధులోకి వచ్చారు.
● నిచ్చెన మెట్ల ద్వారా విమాన గోపురం వద్దకు 11.32 గంటలకు చేరుకున్నారు.
● 11.32కు స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు.
● 11.35కు విమానగోపురంపై ఉన్న శ్రీసుదర్శన చక్రం వద్దకు వెళ్లి వానమామలై రామానుజ జీయర్ స్వామీజీ పర్యవేక్షణలో పూజలు చేశారు. –11.45కు సుదర్శన చక్రానికి, స్వర్ణ విమాన గోపురానికి మహా కుంభాభిషేక, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.
● 11.52కు సుదర్శన చక్రం చుట్టూ సీఎం దంపతులు, ప్రముఖులు, అర్చకులు ప్రదక్షిణలు చేశారు.
● 11.56కు సుదర్శన చక్రం నుంచి విమానగోపురం వద్దకు చేరుకుని తూర్పు త్రితల ద్వారం మార్గంలో ప్రధానాలయంలోకి వెళ్లారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
● 12.10కి గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకున్నారు.
● 12.20కి ముఖ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు ప్రధానాచార్యులు వేద ఆశీర్వచనం చేశారు.
● 12.25కు ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి వారి మహాప్రసాదాన్ని, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఈఓ భాస్కర్‌రావు సీఎం దంపతులకు విమాన గోపుర ప్రతిమ అందజేశారు.
● 12.28కు సీఎం దంపతులు.. వానమామలై రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం హుండీల్లో కానుకలు సమర్పించారు.
● 12.33కు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు.
● 12.35కు లిఫ్టు మార్గంలో అతిథి గృహానికి చేరుకున్నారు.
● 12.40 నుంచి 1.05 గంటల వరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
● 1.08కి యాదగిరి కొండపై నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లి తన చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వివాహంలో పాల్గొన్నారు. అక్కడే భోజనం చేసి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment