ఉత్కంఠ పోరు.. | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరు..

Published Mon, Feb 24 2025 1:43 AM | Last Updated on Mon, Feb 24 2025 1:41 AM

ఉత్కంఠ పోరు..

ఉత్కంఠ పోరు..

ఆ సంఘం నుంచి వచ్చినవారే ఎక్కువ..

ఈసారి పోటీలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పింగలి శ్రీపాల్‌రెడ్డి ప్రస్తుత పీఆర్‌టీయూ అధ్యక్షుడు, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పీఆర్‌టీయూ మాజీ నాయకుడు. పూల రవీందర్‌ కూడా పీఆర్‌టీయూ మద్దతుతోనే గతంలో ఎమ్మెల్సీ కాగా, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పీఆర్‌టీయూ– టీఎస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడే కావడం గమనార్హం.

హోరాహోరీగా ఉపాధ్యాయ

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ప్రధాన సంఘాల అభ్యర్థుల మధ్యే పోటీ

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులంతా ప్రధాన సంఘాల్లో పనిచేసినవారే ఉండటంతో టఫ్‌ ఫైట్‌ సాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

ఐదారుగురి మధ్యే ప్రధాన పోటీ

ఎన్నికల్లో ఐదారుగురి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. యూటీఎఫ్‌ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్‌ నుంచి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్‌ జేఏసీలోని కీలక సంఘాలు, అధికార కాంగ్రెస్‌ అంతర్గత ఆశీస్సులతో ఆ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ఎస్టీయూ మద్దతు, బీసీ వాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, టీపీయూఎస్‌ మద్దతుతో బీజేపీ అధికారిక అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి పోటీ చేస్తుండగా, ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి సుందర్‌రాజు యాదవ్‌ కూడా బీసీ వాదంతో బరిలోకి దిగారు.

సంఘాల బలంలో

పీఆర్‌టీయూ–టీఎస్‌, టీఎస్‌యూటీఎఫ్‌

ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే యూటీఎఫ్‌ మళ్లీ బరిలో నిలిపింది. అభ్యర్థిని ప్రకటించి నాటి నుంచే ఆ సంఘం ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. డివిజన్లు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. పీఆర్‌టీయూ–టీఎస్‌ మద్దతుతో పింగళి శ్రీపాల్‌రెడ్డి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఆ సంఘం జిల్లా, మండల శాఖలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సంఘాలకు క్షేత్రస్థాయిలో సభ్యత్వం ఉంది. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే ఈసారి ఉపాధ్యాయులు ఏవైపు మొగ్గుతారన్నది తేలాల్సి ఉంది.

హర్షవర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అంతర్గత మద్దుతు

టీచర్‌ జేఏసీలోని మెజారిటీ సంఘాల మద్దతుతో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్సీ బరిలోకి దిగారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ముందునుంచే ప్రచారం చేస్తున్నారు. ఈయన కూడా గతంలో పీఆర్‌టీయూ–టీఎస్‌లో పని చేసినవారే. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయనకు అంతర్గత మద్దతు ఉంది.

బీజేపీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి

పీఆర్‌టీయూ–టీఎస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. పీఆర్‌టీయూ–టీఎస్‌లోని పాత కేడర్‌ కూడా ఆయనకు పనికొస్తుందనే ధీమాతో ఉన్నారు. ఆయనకు టీపీయూఎస్‌ ప్రచారం చేస్తుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌ వంటి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

బీసీ వాదంతో పూల రవీందర్‌

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ బీసీ వాదంతో బరిలోకి దిగారు. ఎస్టీయూ, బీసీ సంఘాల మద్దతు ఆయనకు ఉంది. తెలంగాణ ఇంటలెక్చువల్స్‌ ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులుతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మద్దతిచ్చారు. ప్రైవేట్‌ వి ద్యాసంస్థల యజమాని సుందర్‌రాజు యాదవ్‌ కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement