నల్లగొండ : రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ దశ దిశను మార్చేవని తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ పోరం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాల జెండాలుగా మోసేవారుగా ఉన్నారని బీసీల ఓటు బీసీలకు వేసి గెలిపించడం వల్ల బీసీల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఉపాద్యాయులంతా ఏకమై పూల రవీందర్‌ను గెలిపించాలని కోరారు. బహుజన వాదాన్ని గెలిపిస్తే భవిష్యత్‌లో బహుజనులు మంచి స్థానంలో ఉంటారన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, కొంపల్లి భిక్షపతి, నకిరెకంటి కాశయ్యగౌడ్, శ్యాంసుందర్, తిరందాసు రాందాస్, పెండెం శ్రీనివాసులు, మేడె రామకృష్ణ, సమీర్‌కుమార్, యాదగిరి పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
Comments
Please login to add a commentAdd a comment