సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
- 8లో
భక్తులకు ఉచిత ప్రసాదం
మహోత్సవానికి ఎంత మంది భక్తులు వచ్చిన ఉచితంగా పంపిణీ చేసేందుకు పులిహోర తయారు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక శ్రీస్వామి వారి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, మహా కుంభాభిషేకాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా కొండపైన మాడ వీధుల్లో, కొండ కింద కమాన్ వద్ద, వ్రత మండపం వద్ద, ఇతర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విమాన గోపురానికి బంగారం తాపడానికి సహకరించిన దాతలు కూర్చోడానికి కొండపైన, తూర్పు మాడ వీధిలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఈఓతో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment