భయం వద్దు.. నిర్భయంగా చికెన్ తినొచ్చు
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ తినడంపై జనాల్లో ఉన్న భయాన్ని పోగెట్టేందుకు ప్రభుత్వం, వైద్యులు అనేక ప్రకటనలు చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ కేవలం పక్షులకు మాత్రమే వస్తుందని, మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంటున్నారు. మరోవైపు చికెన్ వ్యాపారులు చికెన్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడ, ఆర్‌బీనగర్‌లో చికెన్ షాపుల యజమానులు చికెన్ పకోడీ పంపిణీ చేశారు. అయితే చికెన్ పకోడీ పంపిణీ చేస్తున్న విషయం తెలియడంతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాదాపు 200 కేజీల చికెన్ పకోడీ పంచగా.. కేవలం 30 నిముషాల్లో ఖాళీ అయింది. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో వెన్‌కాబ్, స్థానిక పౌల్ట్రీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో చికెన్ మేళా ఏర్పాటు చేశారు. 500కిలోల ఉడికించిన చికెన్, 3వేల కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేళా నిర్వాహకులు సెంథిల్‌కుమార్, గంగిడి ఆనందరెడ్డి, ముత్యాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ బర్డ్ ఫ్లూపై ప్రజల్లో భయం
పోగొట్టేందుకు వ్యాపారుల ప్రయత్నం
ఫ ఉచితంగా చికెన్, కోడిగుడ్లు,
చికెన్ పకోడి పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment