నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు 14, డీఓలు 14, ఇన్విజిలేటర్లు 193 మందిని నియమించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.
గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతి
విద్యార్థులను నిర్దేశిత సమయం కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పెన్, ఆధార్ కార్డు, పరీక్ష ప్యాడ్ తెచ్చుకోవాలని భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్‌రెడ్డి సూచించారు.
ఫ జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలు
ఫ పరీక్షకు 3,708 మంది విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment