విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
బొమ్మలరామారం : విద్యార్థులు పర్యావరణహితం కోసం భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్‌లో శనివారం మినీ సైన్స్‌ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంతో పాటు పలు ఎగ్జిబిట్‌లను విద్యార్థులు ప్రదర్శించారు. సైన్స్‌ఫెయిర్ నిర్వహణకు సహకరించిన జీఈవర్నోవా, యునైటెడ్ కంపెనీ ప్రతినిధులను డీఈఓ అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఏఎంఓ శ్రీనివాస్, జేసీడీఓ రాధ, డీఎస్‌ఓ రాజశేఖర్, ఎస్‌ఓ లక్ష్మి, జీహెచ్‌ఎం వరలక్ష్మి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనెనా, సీఆర్‌పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment