
వరి గోస!
అన్నదాత..
ఫ అడుగంటుతున్న భూగర్భ జలాలు..
వట్టిపోతున్న బోరుబావులు
ఫ పొట్టదశలో ఉన్న పంటను కాపాడడానికి ఇతర మార్గాల అన్వేషణ
ఫ అన్ని చేసినా పంట దక్కకపోవడంతో జీవాలను మేపుతున్న రైతులు
సాక్షి, యాదాద్రి: ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరి పైరు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోతున్న బోర్లు, బావులతో పొలాలకు నీరందడం లేదు. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి కొత్తబోర్లు వేయడం, టాంకర్ల ద్వారా నీటిని పోయడం చేస్తున్నారు. అన్ని చేసినా పంట దక్కని స్థితిలో రైతులు జీవాలను మేపుతున్నారు.
10వేల ఎకరాల్లో పంటకు దెబ్బ
జిల్లాలోని 2,75,316 ఎకరాల్లో యాసంగి సాగు చేశారు. మూసీ ఆయకట్టులో పెద్దగా నీటి ఇబ్బంది లేదు. భూగర్భ జలాలతో సాగు చేస్తున్న రైతులకే నష్టం వాటిల్లుతోంది. గడచిన పది రోజులుగా సాగునీటి ఇబ్బంది తలెత్తింది. ఆలేరు, తుర్కపల్లి, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం), గుండాల, అడ్డగూడూరు, యాదగిరిగుట్ట, రాజాపేట, మోత్కూరు, వలిగొండ, భువనగిరి మండలాల్లో సుమారు 10వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. అయితే రెండు వేల ఎకరాల లోపు పంట ఎండిపోయిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. గోదావరి జలాలతో చెరువులు నింపినా ప్రయోజనం లేకుండా పోయింది.
వరి పంట అధికంగా
ఎండిపోయిన గ్రామాలు ఇవే..
వలిగొండ మండలం పహిల్వాన్‌పూర్, కంచనపల్లి, పులిగిల్ల, సుంకిశాల, టేకులసోమారం, భువనగిరి మండలం వీరవెల్లి, చందుపట్ల, బండసోమారం, హుస్నాబాద్, మోత్కూర్ మండలం బుజిలాపురం, పనకబండ, రాగిబావి, దత్తప్పగూడెం, ముసిపట్ల, అనాజిపురం, దాచారం, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, జనంపల్లి, ఉత్తటూరు గ్రామాల్లో అత్యధికంగా వరి పంటలు ఎండిపోయాయి.

వరి గోస!
Comments
Please login to add a commentAdd a comment