న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది | - | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది

Published Wed, Mar 12 2025 7:10 AM | Last Updated on Wed, Mar 12 2025 7:09 AM

న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది

న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది

రామగిరి(నల్లగొండ): ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పుతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన దర్శనం నర్సింహను కమిషన్‌ సభ్యులు నల్లగొండ కలెక్టరేట్‌లో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రణయ్‌ హత్య కేసులో ప్రాసిక్యూటర్‌, పోలీసులు సమష్టిగా పనిచేసి తీర్పు రావడండలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ కేసులో దోషులు కరడుకట్టిన నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు రక్షణను కొనసాగించాలని పోలీసులకు సూచించారు. ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతందనే నమ్మకం వచ్చిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రాసిక్యూషన్‌ కొనసాగిందని అభినందించారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు జిల్లా శంకర్‌, రాంబాబు, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

బక్కి వెంకటయ్య

ఫ ప్రణయ్‌ హత్య కేసు వాదించిన

పీపీ దర్శనం నర్సింహకు సన్మానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement