
ఏవియేషన్‌పై అవగాహన ఉండాలి
కోదాడ : విద్యార్థులకు ఏవియేషన్‌పై అవగాహన ఉండాలని, రానున్న రోజుల్లో ఏవియేషన్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని కోదాడకు చెందిన ఏవియేషన్ పైలెట్ ఉయ్యాల ఖ్యాతి అన్నారు. మంగళవారం కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను ఏవియేషన్‌లో శిక్షణ తీసుకొని 19 సంవత్సరాలకే పూర్తి స్థాయి పైలెట్‌గా మారానని తెలిపారు. దీని కోసం అవసరమైన ఏడురకాల లైసెన్స్‌లను పొందానని పేర్కొన్నారు. అమెరికా ఏవియేషన్‌లో తాను శిక్షణ పొందినట్లు తెలిపారు. బాలికలు కూడా ఈ రంగంలో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యు డు జాఫర్, పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య, ప్రిన్సిపాల్ అప్పారావు, సోమానాయక్, రేణుక, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
డిండి: ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. దేవరకొండ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లయ్(డీటీసీఎస్) హన్మంతు శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన బోయిని రమేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు రమేష్ ఇంటిపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్‌కు అప్పజెప్పామని డీటీసీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
మిర్యాలగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోల్ పరిధిలో జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్‌కు చెందిన కుంకునూరి నర్సింహారావు(70) మంగళవారం ఉదయం వాకింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ పరిధిలోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట వాకింగ్ చేస్తుండగా.. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనం ఆచూకీ కోసం రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
నకిరేకల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ సమీపంలో షేక్ సయ్యద్(17) అనే యువకుడు తన తల్లి, అక్కతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. సయ్యద్ లావుగా ఉండటంతో రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి షేక్ సయ్యద్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కాళ్లపై దెబ్బలు ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

ఏవియేషన్‌పై అవగాహన ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment