
కస్తాల శ్రవణ్ కుటుంబానికి అండగా ఉంటాం
హుజూర్‌నగర్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ యువ నాయకుడు, హుజూర్‌నగర్ మున్సి పాలిటీ మాజీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్‌కుమార్ కుటంబానికి అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌కు వచ్చిన మంత్రి శ్రవణ్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్‌కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మాట్లాడారు. శ్రవణ్‌కుమార్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన మనకు దూరం కావడం చాలా బాధాకరమని అన్నారు. శ్రవణ్‌కుమార్ కుటుంబానికి తనతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని, వారి పిల్లల చదువుల ఖర్చుల బాధ్యత కూడా తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్‌రెడ్డి, శివరాం యాదవ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.
పాడె మోసిన మందకృష్ణ మాదిగ..
శ్రవణ్‌కుమార్ అంతిమ యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని పాడె మోశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు చింతిర్యాల నాగయ్య, బాలచంద్రుడు, ఎం. వెంకటేశ్వర్లు, ఎం. శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సీపీఐ నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, సోమగాని కష్ణ, జక్కుల రమణ, సీపీఎం నాయకులు పల్లె వెంకట రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, పి. హుస్సేన్, ఇందిరాల త్రివేణి, వీరస్వామి, వెంకటనారాయణ, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు శ్రవణ్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కస్తాల శ్రవణ్ కుటుంబానికి అండగా ఉంటాం
Comments
Please login to add a commentAdd a comment