గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన మల్లెడ వెంకటవంశీ, గోకులముడి ఆనంద్ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మార్చి హైదరాబాద్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిద్దరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన చొరగుడి తేజతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో గంజాయి తరలిస్తూ.. మార్గమధ్యలో కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన మామిడి తోటలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, హేమన్ నర్సింహ సాయి, పాలపర్తి కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్‌రావుకు గంజాయి ఇస్తుండగా.. పక్కా సమాచారం మేరకు సోమవారం కోదాడ టౌన్ ఎస్‌ఐ సైదులు తన సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. చొరగుడి తేజ, సంపత్ కుమార్, కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్‌రావు, హేమన్ నర్సింహ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మల్లెడ వెంకట వంశీ, గోకులముడి ఆనంద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 9.860 కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ పరారీలో మరో ఇద్దరు
ఫ 9.860 కిలోల గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment