గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

Published Wed, Mar 12 2025 7:09 AM | Last Updated on Wed, Mar 12 2025 7:09 AM

గ్రూప

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

మోత్కూరు: మోత్కూరు మున్సిపల్‌ కేంద్రానికి చెందిన గుర్రం మోహన్‌రెడ్డి, స్వరాజ్యం దంపతుల కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి మంగళవారం ప్రకటరించిన గ్రూప్‌–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 మార్కులు సాధించి స్టేట్‌ 11వ ర్యాంకు సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్‌–4 ఫలితాల్లో జిల్లా ఫస్ట్‌ ర్యాంకు సాధించి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ రెవెన్యూ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా డు. సాయికృష్ణారెడ్డి చెల్లె సాయిసుప్రియ కూడా గ్రూప్‌–4లో మంచి ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్‌ కార్యాలయంలో వార్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రూ ప్‌–2 ఉద్యోగానికి ఎంపికై న సాయికృష్ణారెడ్డిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

సిరిపురం యువకుడికి

రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు

రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సత్తయ్య–మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు సిలువేరు సురేష్‌ మంగళవారం గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. సురేష్‌ 600 మార్కులకు గాను 411.865 మార్కులు సాధించాడు. బీటెక్‌ చదివిన సురేష్‌ మూడునెలల క్రితం గ్రూప్‌–4లో ఉత్తీర్ణుడై జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం చౌటుప్పల్‌ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

అన్నదమ్ముల హవా..

పెన్‌పహాడ్‌: గ్రూప్‌–2 ఫలితాల్లో పెన్‌పహాడ్‌ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్‌ మధు రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, అతడి తమ్ముడు శ్రీరామ్‌ నవీన్‌ 326వ ర్యాంకు సాధించారు. మధు 2014లో వీఆర్వోగా ఎంపికై ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో అనంతగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు నవీన్‌ 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

141వ ర్యాంకు సాధించిన వెలిదండ వాసి

గరిడేపల్లి: మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి చెందిన అనంత సుమన్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 141వ ర్యాంకు సాధించారు. 600 మార్కులకు గాను 387.75 మార్కులతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సుమన్‌ 2019 డీఎస్సీలో ఓపెన్‌ కేటగిరీలో ఎస్‌జీటీ ఉద్యోగాన్ని సాధించారు. వికారాబాద్‌ జిల్లా పోటుపల్లి మండలం నాగసానిపల్లిలో ఎస్‌జీటీగా పనిచేస్తూనే గ్రూప్‌–2 పరీక్ష రాసి 141వ ర్యాంకును సాధించాడు. సుమన్‌ను గ్రామస్తులు అభినందించారు.

130వ ర్యాంకు సాధించిన

నాగులపాటి అన్నారం వాసి

పెన్‌పహాడ్‌: మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగార్జున గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 130వ ర్యాంకు సాధించారు. ఎంకాం పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నాగార్జునను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

గ్రూప్‌–1ఉద్యోగానికి ఎంపికైన గూడపూర్‌ యువకుడు

నల్లగొండ టూటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌–1 ఫలితాల్లో మునుగోడు మండలం గూడపూర్‌ గ్రామానికి చెందిన నన్నూరు వెంకట్రామ్‌రెడ్డి,

మంజుల దంపతుల కుమారుడు నన్నూరి మనోజ్‌కుమార్‌రెడ్డి 517 మార్కులు సాధించి టాప్‌ టెన్‌లో ఒకడిగా నిలిచాడు. టాప్‌ టెన్‌లో నిలిచిన మనోజ్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం లభించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు1
1/5

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు2
2/5

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు3
3/5

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు4
4/5

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు5
5/5

గ్రూప్‌–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement