
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి,యాదాద్రి: ఈ నెల 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు వస్తుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు మంత్రుల రాక సందర్భంగా మంగళవారం స్థానిక మినీ మీటింగ్ హాల్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయతీ, ఎకై ్సజ్, వైద్య, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖలు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు, అగ్నిమాపక సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అదేవిధంగా సీపీఆర్ బృందాలను, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శానిటేషన్ పనుల కోసం పంచాయతీ శాఖ దృష్టి సారించాలన్నారు. సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
తప్పిదాలు లేకుండా
సేవలు అందించాలి
భువనగిరిటౌన్: ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భువనగిరిలోని మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం నూతనంగా వచ్చిన యూడీఐడీ పోర్టల్ గురించి వివరించారు. మీ సేవలో చేసే దరఖాస్తుల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మీసేవ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సాయికుమార్, మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు.
నేటి నుంచి సీపీఎం
పోరుయాత్ర
భువనగిరిటౌన్: జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రజా సమస్యలపై సీపీఎం పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జహంగీర్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికీ బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27, 28, 29వ తేదీల్లో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని, ఏప్రిల్ రెండో వారంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment