గోదావరి జలాలతో చెరువులు నింపడంతో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. కానీ ఎండలు ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయి. మూడెకరాల పంటలో ఎకరం వరి పంట నీరు లేక ఎండిపోతోంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వరి నాట్ల కోసం పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వచ్చింది.
– గాజుల నర్సయ్య, రైతు, మహబూబ్‌పేట, యాదగిరిగుట్ట మండలం
రెండు ఎకరాలు ఎండిపోయింది
నాకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేశాం. నాటు వేసే సమయంలో బావిలో నీరు బాగానే ఉంది. కానీ వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. చేతికందిన రెండు ఎకరాలు వరి పంట ఎండిపోయింది. మూడు ఎకరాల సాగు కోసం వారం రోజుల క్రితం వ్యవసాయ భూమిలో రెండు బోర్లు వేశాను. చుక్క నీరు కూడా రాలేదు. రూ.1,25,000 అప్పు అయ్యింది.
– చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం, ఆలేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment