ప్రశాంతత కోసం బుద్ధవనాన్ని సందర్శించాలి
నాగార్జునసాగర్: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్‌కే మిశ్రా అన్నారు. నల్లగొండ జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన బుధవారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని అష్టబుద్ధుల వద్ద ధ్యానం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించారు. ఆయనకు బుద్ధవనం చరిత్ర గురించి గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట డీఆర్‌డీఏ ఏపీడీ శేఖర్‌రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆపద మిత్ర ప్రోగ్రాం శిక్షకులు తదితరులు ఉన్నారు.
ఫ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్‌కే మిశ్రా
Comments
Please login to add a commentAdd a comment