‘సిరిపురం’ పర్సన్ ఇన్‌చార్జ్‌గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జ్‌గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్‌చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్‌షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్‌మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జ్‌గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్‌ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment