హనీట్రాప్‌తో విలవిల! | - | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌తో విలవిల!

Published Thu, Mar 6 2025 1:58 AM | Last Updated on Thu, Mar 6 2025 1:53 AM

హనీట్రాప్‌తో విలవిల!

హనీట్రాప్‌తో విలవిల!

న్యూడ్‌ కాల్స్‌తో సైబర్‌నేరగాళ్ల మోసం

ఆలేరుకు చెందిన ఓ యువకునికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. కాల్‌ లిఫ్టు చేయడంతో యువతి హిందీలో మాట్లాడుతూ న్యూడ్‌గా డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ కట్‌ అయ్యింది. వెంటనే మరో కాల్‌ వచ్చింది. నీవు న్యూడ్‌కాల్‌ చూశావని ఆ వీడియో నాదగ్గర ఉంది, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వీడియో నీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో యువకుడు భయాందోళన చెంది పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు యువతినుంచి వచ్చిన నంబర్‌ను బ్లాక్‌ చేశారు.

రూ.లక్షల్లో డిమాండ్‌

పరువుపోతుందని అడిగినంత

సమర్పించుకుంటున్న బాధితులు

కొందరు పోలీసులకు ఫిర్యాదు

వెలుగురాని కేసులు అనేకం

తాజాగా నకిరేకల్‌ ఎమ్మెల్యేకు న్యూడ్‌ కాల్‌తో కలకలం

నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్‌ కాల్‌తో సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌లు సైబర్‌ మోసగాళ్ల నంబర్‌ను బ్లాక్‌ చేసి విచారణ ప్రారంభించారు.

సాక్షి, యాదాద్రి : ఇటీవల జిల్లాలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి మొబైల్‌కు హాయ్‌ అని మెసేజ్‌ వచ్చింది.. అది సైబర్‌ నేరగాళ్ల కాల్‌ అని తెలియక సదరు వ్యక్తి వెంటనే రిప్లై ఇచ్చాడు. అదే నంబర్‌నుంచి ఓ అందమైన యువతి వీడియో కాల్‌.. అందులో నగ్నంగా కనిపిస్తూ మాటల్లోకి దింపింది. యువతి మాయమాటలు నమ్మి ప్రజాప్రతినిధి కూడా న్యూడ్‌లా కనిపించేశాడు. ఇంకేముంది ఆ దృశ్యాన్ని యువతి స్క్రీన్‌షాట్‌ తీసి అతనికి సెల్‌ఫోన్‌కు పంపించి డబ్బులు పంపాలంటూ డిమాండ్‌ చేసింది. లేకపోతే వీడియోనూ వైరల్‌ చేస్తానని బెదిరించింది. పరువుపోతుందన్న భయంతో యువతి అడిగినంత డబ్బును మాజీ ప్రజాప్రతినిధి సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.. హానీట్రాప్‌ ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని సైబర్‌కేటుగాళ్లు నిలువెల్లా దోచుకుంటున్నారు.

రోజుకో రకంగా మోసం

మోసం చేయడానికి సైబర్‌ నేరగాళ్లు వెనకాడడం లేదు. రోజుకో రకమైన మోసానికి తెరలేపుతున్నారు. ఫేక్‌ కాల్స్‌ చేస్తూ లేదా వీడియో కాల్స్‌చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. యువత, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. ఇలా అనిన వర్గాల వ్యక్తులు మోసపోయిన వారిలో ఉంటున్నారు.సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ను సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. అందమైన యువతుల డీపీ ఫొటోలున్న నంబర్‌ నుంచి హాయ్‌ అని మెసేజ్‌ పంపుతున్నారు. కొందరు స్పందించి రిపై్ౖల ఇస్తున్నారు. చాటింగ్‌ చేస్తున్న క్రమంలో న్యూడ్‌ కాల్స్‌ వస్తున్నాయి. న్యూడకాల్స్‌ చూస్తున్నారే తప్ప.. సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో పడుతున్నామన్న విషయం గ్రహించడం లేదు. సైబర్‌ నేరగాళ్లు న్యూడ్‌ కాల్స్‌ను రికార్డు చేసి బెదిరిస్తున్నారు. మరికొందరు ఫేస్‌బుక్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతారు. అందమైన యువతి ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్‌ను ఓకే చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తికి సంబంఽధించిన ఫ్రెండ్స్‌, బంధువులు, కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్ల వారికి తెలిసిపోతున్నాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి నంబర్లు సేకరించి వారి న్యూడ్‌ కాల్‌ వీడియోను పంపిస్తామని, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తానని, బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. సదరు వ్యక్తికి చెందిన ఒకరిద్దరికి న్యూడ్‌కాల్‌ క్లిప్‌లు పంపించి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో విషయం అందరికి తెలిస్తే పరువుపోతుందన్న భయంతో చాలామంది సైబర్‌నేరగాళ్లకు డబ్బులు సమర్పించుకుని లబోదిబోమంటున్నారు. పరువు పోతుందన్న భయంతో పోలీస్‌లను ఆశ్రయించడంలేదు. కాగా ఎక్కువ కాల్స్‌ మధ్యప్రదేశ్‌ పేరుతో వస్తున్నా. రాజస్థాన్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement