సాక్షి, యాదాద్రి : వివిధ పథకాలకు సంబంధించి ఆదేశించి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మండల పరిషత్, పంచాయతీ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఉపాధిహామీ పథకం, నర్సరీ, ప్లాంటేషన్ సర్వైవల్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు షెడ్ నెట్‌ల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు నీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధిహామీ పథకంలో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి గడువులోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించార. పనులను ఫొటో తీసి పంపాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు., సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment