భువనగిరిటౌన్ : మీకు దండం పెడుతా.. అమ్ముకోనియ్యండి.. బత్తాయిల వ్యాపారమే జీవనాధారం.. ఇబ్బందులకు గురి చేయకండి.. అని ఓ మహిళా రైతు ట్రాఫిక్ పోలీసులను వేడుకుంది. ఈ సంఘటన బుధవారం భువనగిరిలోని బాబుజగ్జీన్‌రాం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. భువనగిరి, రామన్నపేట, వలిగొండతో పాటు వివిధ మండలాల రైతులు తాము పండించిన పండ్లు, బతాయిలు, నిమ్మకాయలను కొన్నేళ్లుగా బాబుజగ్జీవన్‌రాం చౌరస్తాలో విక్రయిస్తున్నారు. బుధవారం ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్‌జామ్ అవుతుందని, తొలగించాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కలగజేసుకుని బతుకుదెరువు దెబ్బతీయొద్దని ట్రాఫిక్ పోలీసును వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment