‘ఉపాధి’లో 266 రకాల పనులు
ఆలేరు రూరల్: జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనికల్పించేందేకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తం 266 రకాల పనులు చేపట్ట డమే లక్ష్యంగా అంచనాలు రూపొందించారు. ఏప్రిల్ 1నుంచి కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభించి 2026 మార్చి 31వ తేదీన పూర్తి చేయనున్నారు.
సీజన్‌కు అనుగుణంగా పనులు
గ్రామసభల్లో గుర్తించిన ఉపాధిహామీ పనులు సీజన్‌కు అనుగుణంగా ఉంటాయి. ఈసారి నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి శుభ్రం చేయడం, భూముల అభివృద్ధి, నీటి కుంటల నిర్మాణం ఎక్కువగా చేపట్టనున్నారు. అదే విధంగా పొలాల వద్దకు రోడ్ల అనుసంధానం, వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో ఉపాధిహామీ కూలీల వివరాలు
జిల్లాలోని 17 మండలాల్లో 428 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్ కార్డులు 1,43,205 కాగా యాక్టివ్ జాబ్ కార్డులు 93,848 ఉన్నాయి. కూలీలు 1,37,475 మంది ఉండగా 25,49,676 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దినసరి కూలి రూ.302 చెల్లించనున్నారు. మొత్తం రూ.32.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ఆత్మీయభరోసాతో పెరగనున్న కూలీలు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లిస్తుంది. దీంతో ఉపాధిహామీ పనుల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ రూపొందించారు.
2025–26 సంవత్సరానికి కార్యాచరణ
ఫ 25,49,676 పని దినాలు
ఫ రూ.32.40 కోట్ల బడ్జెట్
ఫ గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు
ఫ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు
వంద రోజులు పని కల్పిస్తాం
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాం. పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వద్ద కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. –నాగిరెడ్డి, డీఆర్‌డీఓ
‘ఉపాధి’లో 266 రకాల పనులు
Comments
Please login to add a commentAdd a comment