పొన్నవాహనంపై నృసింహుడి విహారం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత భాజాభజంత్రీలు, సన్నాయి మేళాల మధ్య మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. భక్తులు పొన్నవాహనసేవలో పాల్గొని పులకించారు. పొన్న వృక్షమును దేవ వృక్షముగా పురాణాలు పేర్కొంటున్నాయి. దీనికే కల్ప వృక్షమని అంటారని అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ఉంటుంది.
పొన్నవాహనంపై నృసింహుడి విహారం
Comments
Please login to add a commentAdd a comment