మహిళా చట్టాలపై అవగాహన అవసరం
భువనగిరి : మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అవే వారిని కాపాడుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, జడ్జి మాధవిలత పేర్కొన్నారు. బుధవారం భువనగిరిలోని మాస్ నర్సింగ్ స్కూల్‌లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్ట పరమైన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ మాధవరెడ్డి, అధ్యాపకులు స్వాతి తదితరులు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్‌కు రివార్డు
సాక్షి, యాదాద్రి : ఆలిండియా పోలీస్‌డ్యూటీ మీట్–2025లో గోల్డ్ మెడల్ సాధించిన ఆలేరు పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని బుధవారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు రివార్డుతో సత్కరించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఫిబ్రవరి 10నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్విస్టిగేషన్ విభాగంలో యాదగిరి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. కమిషనరేట్‌కు ఎక్కువ మెడల్స్ వచ్చేవిధంగా ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వాలని యాదగిరికి సీపీ సూచించారు.
ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయండి
రామన్నపేట: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రామన్నపేట మండలంలో ఈ నెల 23నుంచి 28వ తేదీ వరకు ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. రామన్నపేటలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామన్నపేట మండలంలోని 24 గ్రామాల్లో ఆరు రోజు పాటు135 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసి సమస్యలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. రామన్నపేట శాసనసభ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, ఆస్పత్రిని వండ పడకలకు పెంచాలని, అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వ లను ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైల్ల అశయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్లూరి అంజయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
Comments
Please login to add a commentAdd a comment