మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా సాధించగలరని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసం, శారీరక ధృడత్వం చేకూరుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ మహిళలు ఉద్యోగులు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తుండాలని, దీనివల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి విధులపై ఏకాగ్రత ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారి ధనంజనేయులు తెలిపారు. టెన్నికాయిట్, షటిల్, చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్ , సింగింగ్ –మ్యూజికల్ చైర్ పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ప సీఈఓ శోభారాణి, యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ భాస్కర్‌రావు, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, సెక్రటరీ దశరథరెడ్డి,తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment