ఫ భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులోని గుట్టల్లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో గుట్టలకు సమీపంలో ఉన్న ఉండ్రుగొండ, దురాజ్‌పల్లి, వల్లభాపురం, మహ్మదాపురం, ఇమాంపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలు తీవ్రంగా ఉండడంతో రాత్రివేళ చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. పశువుల కాపరులు చుట్ట లేదా బీడీలు తాగి పడేయడంతో ఎండిన ఆకులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవచ్చని పేర్కొన్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలు వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు వీలుకావడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment