కోదాడ రూరల్: పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన బచ్చలకూర శంకర్ కుమార్తె నవ్య పెన్‌పహాడ్ మండలం అనాజిపురంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నవ్య.. ఇంటి వద్ద నుంచే బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మొదటి పరీక్షకు హాజరై తిరిగి వచ్చింది. జ్వరంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెందిన నవ్య గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment