
అమ్మ భాష తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. కొంత మంది విద్యార్థులు తెలుగు వ్యాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాతృ భాష అయిన తెలుగును కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
– రాజు, తెలుగు ఉపాధ్యాయుడు,
తిరుమలగిరి
తిరుమలగిరి (తుంగతుర్తి): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష (తెలుగు) సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్‌ఈతో పాటు ఇతర సిలబస్‌ను అమలు చేస్తూ మాతృభాషను పక్కన పెడుతున్నారు. దీంతో విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోవడమే కాదు కనీసం చదవడం కూడా రావడం లేదని గ్రహించిన ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా బోధించేలా చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది.
అధిక మార్కుల కోసం..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం లేదు. సీబీఎస్‌ఈ, ఐబీహెచ్‌ఈ తదితర సిలబస్‌ను అమలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు భాష ఎంపిక స్థానంలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా సంస్కృతం, అరబిక్ బోధిస్తున్నారు. దీంతో తెలుగులో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను కోల్పోతున్నట్లు భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ముందు తొమ్మిదవ తరగతికి..
ఇప్పటి వరకు ఉన్నత తరగతులకు తెలుగు పాఠ్యాంశాలు అమలు చేయని పాఠశాలలకు తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2026–27 నుంచి 10వ తరగతికి అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించాల్సిందే..
ఎన్‌సీఈఆర్‌టీ ఆదేశాలతో
ప్రభుత్వ నిర్ణయం

అమ్మ భాష తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment