
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మూడేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. నకిరేకల్‌లో కిడ్నాపర్‌ని పట్టుకొని అతడి చెర నుంచి బాలుడిని విడిపించి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన షమీమున్సీసా, హైమద్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరు గత మూడేళ్లుగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వాటర్ ట్యాంక్ కింద నివాసముంటూ అక్కడే ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తింటూ జీవనం సాగిస్తున్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన సీతారాములు చెల్లెలికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మగ పిల్లలు లేరని ఆమె బాధపడుతుండడంతో చూడలేక సీతారాములు వారం క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న హైమద్ కుటుంబాన్ని చూశాడు. వారితో పరిచయం పెంచుకొని వారి కుమారుడిని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి నకరేకల్‌లో ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో హైమద్ దంపతులు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలించి సీతారాములు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు నకరేకల్‌లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఫ రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు
ఫ మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు
ఫ నకిరేకల్‌లో కిడ్నాపర్‌ని పట్టుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment