
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్‌కుమార్(26) దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ రోజు బంక్‌లో డబుల్ డ్యూటీ చేసిన అరుణ్‌కుమార్ ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోవడంతో బంక్ నిర్వాహకులు అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్‌లో డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద యువకుడు ఉరేసుకుని మృతిచెందినట్లు గురువారం ఉదయం పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడంతో.. ఆ మృతదేహం అరుణ్‌కుమార్‌దిగా గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు గంధం వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునప్నట్లు ఎస్‌ఐ తెలిపాడు. అరుణ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహంతో ఆందోళన..
అరుణ్‌కుమార్ ఆత్మహత్యకు పెట్రోల్ బంక్ యాజమానే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో గురువారం దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ ెపెట్రోల్ బంక్ వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బంక్ యాజమాని తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆదోళనను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment