భువనగిరి: జిల్లాలో 2025 సంవత్సరానికిగాను వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు 12 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు వారి ప్రగతికి సంబంధించి ధ్రువపత్రాలు జత చేయాలని తెలిపారు. ఏదైనా ఒక క్రీడలో మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 17వ తేదీలోపు సమర్పించాలని, వివరాలకు 83099 92451 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment