భూదాన్‌పోచంపల్లిలో త్రిఫ్ట్ సర్వే
భూదాన్‌పోచంపల్లి: పట్టణ కేంద్రంలో గురువారం చేనేత జౌళిశాఖ అధికారులు నేతన్న పొదుపు పథకం(త్రిఫ్ట్) కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. ఆయా కాలనీల్లో చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి మగ్గాలు నేస్తున్నారా.. అనుబంధ కార్మికులు ఏయే పనులు చేస్తున్నారని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ.. నేతన్న పొదుపు పథకానికి పోచంపల్లిలో మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు కలిపి మొత్తం 3180 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటింటా తిరిగి 1480 దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తి చేశామన్నారు. మరో మూడు రోజుల్లో మిగిలిన లబ్ధిదారుల సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నిజమైన కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన డీఓ, ఏడీఓలు, సీడీలు పాల్గొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
భువనగిరిటౌన్ : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామపంచాయతీల నుంచి గ్రంథాలయ సెస్ వసూలు చేయాలని తెలిపారు. గ్రంథాలయాల్లో నూతన సభ్యులను చేర్పించాలని పేర్కొన్నారు. మోత్కూరు, బొమ్మలరామారం శాఖ గ్రంథాలయాలకు నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతి గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో గ్రంథపాలకులు, ఉద్యోగులు, పార్ట్ టైం వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లిలో త్రిఫ్ట్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment