అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
చౌటుప్పల్: 2035నాటికి చౌటుప్పల్ పట్టణంలో 2లక్షల మంది నివాసం ఉండనున్నారని, అందుకే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో నెలకొన్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు అభివృద్ధిపై గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను ప్రథమ ప్రాధ్యాన్యతగా విస్తరించాలని తెలిపారు. 100, 80, 50ఫీట్ల వెడల్పుతో రోడ్లు ఉండాలని చెప్పారు. చిన్నకొండూర్ రోడ్డు 80, వలిగొండ రోడ్డు, తంగడపల్లి రోడ్డు 100 ఫీట్లుగా ఉండాలన్నారు. సర్వీస్‌రోడ్లు శాసీ్త్రయంగా నిర్మాణం జరగాలని సూచించారు. ఊర చెరువు అలుగు, వరదనీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు అవసరమైన కాలువ కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి, డీఈ మనోహర, అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment