ఉత్తమ ఫలితాలకు ఏకాగ్రత అవసరం
రాజాపేట: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రాజాపేట మండలం బొందుగుల గ్రామంలోని ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైడే సానిటేషన్ నిర్వహించాలని ఎండీఓకు సూచించారు. రాజాపేట ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్సత్రికి తరలిస్తే అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment