సాక్షి,యాదాద్రి : వేసవిలో మంచినీటి ఎద్దడి, విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. పూర్తి సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని ఆయా శాఖల అధికారులకు ఉన్నతస్థాయి ఆదేశాలు అందాయి.
ఇంగ్లిష్ పేపర్–1కు
6,104 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 6,411 మంది విద్యార్థులకు 6,104 మంది హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభా గంలో 4,757 మందికి ,4628 మంది హాజరు కాగా.. 129 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 1,654 మందికి గాను 1,476 మంది పరీక్ష రాశారు. 178 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు పలువురు అధికారులు తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment