
మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీటీంలు
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అర్జునయ్య
సాక్షి యాదాద్రి : మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం జిల్లాలో మూడు షీటీంలు ఏర్పాటు చేశాం. సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాం.. అని భువనగిరి మహిళా పోలీసు స్టేషన్ సీఐ అర్జునయ్య తెలిపారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన
‘సాక్షి’తో మాట్లాడారు.
తాగుడుకు బానిసలై..
భర్తలు మద్యానికి, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై భార్యలను వేధింపులకు గురిచేస్తున్న సంఘటనలు పేద, ఽమధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అదనపు కట్నం కావాలని కొందరు, బెట్టింగ్‌లో నష్టపోయి మరికొందరు.. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. మాటవినకపోతే వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళలు న్యాయంకోసం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
అధికంగా గృహహింస కేసులే..
మహిళలు, విద్యార్థినులకు సంబంధించి 2023లో 1,118 ఫిర్యాదులు రాగా 128 కేసులు, 2024లో 999 ఫిర్యాదులు రాగా 111 కేసులు నమోదయ్యాయి. 2025 మార్చి 5వ తేదీ నాటికి 150 ఫిర్యాదులు రాగా 23 కేసులు నమోదు చేశాం. ఇందులో గృహహింసకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
షీటీంలతో నిరంతర నిఘా
మహిళలు, విద్యార్థునులకు షీటీంలు అండగా ఉంటున్నాయి. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటూ నిఘా ఉంచుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు షీటీంలు పనిచేస్తున్నాయి.
100 కు డయల్ చేయండి
87126 62762 షీటీం నంబర్

మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీటీంలు
Comments
Please login to add a commentAdd a comment